Thursday, May 2, 2024

బోగస్ చలానాల స్కాంలో బయటపడుతున్న నిజాలు

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపుతోంది. కార్యాలయాల్లోనూ చలానాలకు సంబంధించి ఒరిజినల్, నకిలీ అన్న దానిపై నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలకు దిగింది. ఈ క్రమంలో అన్ని రిజస్ట్రేషన్ కార్యాయాల్లో మోసాలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం గుట్టురట్టయ్యింది. అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్‌పై పోలీసులకు సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. మొత్తం 69 డాక్యుమెంట్లకు గాను రూ.21 లక్షల మేర అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. అటు గుంటూరు జిల్లా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల స్కామ్ బయటపడింది.

నాలుగు నెలల లావాదేవీలపై అధికారులు తనిఖీలు చేయగా 8 మంది నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. 8 మంది నుంచి రూ.8 లక్షలు రికవరీ చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కడప జిల్లాలో భారీ స్థాయిలో నకిలీ చలానాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్నీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చలానాలకు సంబంధించి ఒరిజినల్, నకిలీ అన్న దానిపై నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలకు దిగింది. ఈ క్రమంలో అన్ని రిజస్ట్రేషన్ కార్యాయాల్లో మోసాలు బయటపడ్డాయి.

కాగా ఏపీలోని స్టాంప్స్ – రిజిస్ట్రేషన్ శాఖలో బోగస్ చలానాల స్కామ్‌పై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏడాదిగా జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. రూ.5.5 కోట్ల మేర అవకతవకలను గుర్తించారు. రూ.10 కోట్ల వరకు అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. ఇవాళ లేదా రేపు పటమట సబ్ రిజిస్ట్రార్‌నూ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

ఈ వార్త కూడా చదవండి: తూ.గో.జిల్లాలో బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సందడి

Advertisement

తాజా వార్తలు

Advertisement