Thursday, April 25, 2024

శాకుంతలం షూటింగ్ కంప్లీట్ – అఫీషియల్

అక్కినేని సమంత, స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం మహాభారతంలోని ఆదిపర్వం కాళిదాస్ అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. శకుంతల గా సమంత నటిస్తుండగా… దుష్యంతుని పాత్ర లో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.

ఇక మరోవైపు మోహన్ బాబు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ, గౌతమి, వర్షిని సుందరరాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement