Friday, April 26, 2024

2023లో ఎగుమతులు మందగమనమే.. వాణిజ్య ఆంక్షలే కారణమా?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రతికూల ప్రభావం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక మాంద్యం ఆందోళనల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2023లో ఎగుమతుల ధోరణి కొనసాగక పోవచ్చని భారతదేశ రేటింగ్స్‌అండ్‌ రీసెర్‌ ్చ గురువారం తెలిపింది. రష్యాపై విధించబడిన ప్రపంచ సరఫరా గొలుసు, వాణిజ్య ఆంక్షలు భారతదేశంలోని వివిధ అనుబంధ రంగాలలో నిరంతర ఆటంకాలను ఏర్పరచింది. 2022 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వస్తువులు ఎగుమతులలో కనిపించిన ఉత్సాహం, దేశీయంగా బలహీనమైన డిమాండ్‌ మధ్య అనేక తయారీ విభాగాలకు మద్దతునిచ్చింది.

అయితే ఇది విస్తృత ఆధారితమైనది కాదు. కానీ కొన్నిరంగాలకు మాత్రం పరిమితం చేయబడింది అని రేటింగ్‌ ఏజెన్సీతెలిపింది. 2016-20 సమయంలో భారతదేశ సగటు వార్షిక సరుకుల ఎగుమతులు 2019 ఆర్థిక సంవత్సరంలో 330.08 బిలియన్‌ డాలర్ల నుంచి 297.02 బిలియన్‌ డాలర్ల మధ్య ఉన్నాయి. 2022లో అత్యధికంగా 421.89 బిలియన్‌ డాలర్లకు ఎగబాకాయని ఇండియన్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో ప్రధాన ఆర్థిక వేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement