Thursday, December 5, 2024

బిజెపిలో దిలీప్ కుమార్ – కెసిఆర్ అవినీతి చిట్టా విప్పుతానంటున్న బండి..

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్సీ క‌పిల‌వాయి దిలీప్ కుమార్ నేడు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి క‌మ‌ల‌ద‌ళంలోకి ఆహ్వానించారు..ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏక్ నంబర్, మంత్రి కేటీఆర్ దస్ నంబర్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని, తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. స్పీకర్‌ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడతానని సంజయ్ అన్నారు. ముమ్మాటికీ పార్లమెంట్‌ను కుదిపేసే అంశమవుతోందని తెలిపారు. కాగా, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో జరిగిన వామన్ రావు హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement