Wednesday, May 15, 2024

గజకేసరిగా ‘యష్’

గజకేసరిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యష్. కేజీఎఫ్2 కూడా తెరకెక్కుతోంది. ఈ మూవీ జూలై 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్  ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యాడు య‌ష్‌. దీంతో ఆయ‌న న‌టించిన సినిమాలను డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా య‌శ్, అమూల్య‌, సాధు కోకిల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎస్ కృష్ణ తెర‌కెక్కించిన గ‌జ‌కేస‌రి చిత్రాన్ని మార్చి 5న ఇక్కడ విడుద‌ల చేయ‌నున్నారు. 2014 మే 23న ఈ క‌న్న‌డ చిత్రం శాండ‌ల్‌వుడ్‌లో విడుద‌ల కాగా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  సాయంత్రం 4.05 ని.ల‌కు చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement