Sunday, May 28, 2023

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. చేరికలకు పెద్ద ఎత్తున ప్లాన్​

భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ ఎస్) పార్టీ విస్త‌ర‌ణ‌కు ప్లాన్ జ‌రుగుతోంది. తొలుత ప‌క్క రాష్ట్రం ఆంధ్రప్ర‌దేశ్‌లో పాగా వేసేందుకు పార్టీ అధినేత స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికి ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేరిక‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. మొన్న ఏపీ స్టూడెంట్స్ జేఏసీ భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ త‌ర‌హా ప‌థ‌కాలు, పాల‌న ఏపీలో అవ‌స‌రం ఉంద‌ని, కేసీఆర్ నాయ‌క‌త్వం ఏపీకి ఎంతో అవ‌స‌ర‌మ‌ని తీర్మానించారు. ఇక‌.. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో తోట చంద్రశేఖర్ చేర‌బోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో చేరికలు ఉంటాయ‌ని స‌మాచారం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement