Tuesday, March 26, 2024

Twitter | 48,624 అకౌంట్స్​పై నిషేధం.. చైల్డ్​ ఫోర్నోగ్రఫీ, టెర్రర్​ యాక్టివిటీస్​పై ట్విట్టర్​ చర్యలు!

ఎలన్ మస్క్ నేతృత్వంలో కొనసాగుతున్న మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్.. సంస్థకు అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోంది. పిల్లల లైంగిక దాడులు.. న్యూడ్​ వీడియోలకు సంబంధించిన కంప్లెయింట్స్​కు పరిష్కారం చూపింది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ 26, నవంబర్ 25 మధ్య దేశంలో 45,589 అకౌంట్స్​ని నిషేధించింది. అయితే.. పలు విషయాలలో కొత్త యజమాని తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలపై ట్విట్టర్​ ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక.. దేశంలో ట్విట్టర్​ ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలిగించినట్టు ట్విట్టర్​ తెలిపింది. మొత్తంగా దేశంలో 48,624 ఖాతాలను నిషేధించినట్టు స్పష్టం చేసింది.

ట్విట్టర్ కొత్త IT రూల్స్ 2021కి అనుగుణంగా తన నెలవారీ నివేదికలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా అదే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుండి 755 ఫిర్యాదులను స్వీకరించిందని..  వాటిలోని 121 URLలపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతో పాటు వ్యక్తిగత వినియోగదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. భారతదేశం నుండి చాలా ఫిర్యాదులు అందుతున్నా.. వాటిలో ఎక్కువగా దుర్వినియోగం, వేధింపులు (681), IP-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15) వంటివి ఉన్నాయి. తన కొత్త నివేదికలో అకౌంట్​ సస్పెన్షన్‌లను అప్పీల్ చేస్తున్న 22 ఫిర్యాదులను కూడా ప్రాసెస్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement