Sunday, May 5, 2024

వ‌చ్చే నెల‌ నుంచి పెరగనున్న ఈవీ టూ వీలర్స్‌ రేట్లు..

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఫేమ్‌-2 సబ్సిడీని భారీగా తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సోమవారం నాడు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫాస్టర్‌ ఎడాప్షన్‌ ఆఫ్ మాన్యూఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎఫ్‌ఏఎంఈ-ఫేమ్‌) -2 సబ్సిడీని తగ్గించినందున జున్‌ 1 నుంచి ఈవీ టూ వీలర్స్‌ రేట్లు పెరగనున్నాయి. టూ వీలర్స్‌ సామర్ధ్యాన్ని బట్టి సబ్సిడీని ఇస్తున్నారు. ఒక కిలోవాట్‌కు ప్రస్తుతం ఇస్తున్న 15,000 వేల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం 10,000 రూపాయలకు తగ్గించింది. టూ వీలర్స్‌ ఇస్తున్న సబ్సిడీపై కూడా ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. ఇది ఇప్పటి వరకు 40 శాతంగా ఉంది. ఇక నుంచి ఇది 15 శాతంగా ఉండనుంది. ఈ రెండు మార్పులు చేసినందున ప్రభుత్వం ఫేమ్‌-2 నిబంధనల్లోని సెక్షన్‌ 20(ఐ)ని, సెక్షన్‌ 26(ఐ)ని సవరించనుంది.

నిబంధనలు సవరించనున్న ప్రభుత్వం ఇక నుంచి దేశంలో విద్యుత్‌ బస్సుల సంఖ్య పెంచేందుకు సబ్సిడీని పెంచనుంది. దేశంలో మరిన్ని విద్యుత్‌ టూ వీలర్స్‌ మార్కెట్‌లోకి రావాలని భావిస్తున్న ప్రభుత్వం అదే సమయంలో విద్యుత్‌ బస్సులపై ఎక్కువ కేంద్రీకరించాలని నిర్ణయించింది. కేంద్రం ఇప్పటికే 50వేల విద్యుత్‌ బస్సులన సేకరించి, ఆయా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే టెండర్లను కూడా అహ్వానించింది.

కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 స్కీమ్‌ను 2019, ఏప్రిల్‌1 న ఐదు సంవత్సరాల కాలపరిమితితో ప్రారంభించింది. ఈ స్కీమ్‌ కింద 10వేల కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించింది. టూ వీలర్స్‌కు ఈ స్కీమ్‌ను వర్తింప చేయడం వల్ల విద్యుత్‌ బైక్‌లు, స్కూటర్ల ధరలు ఆ మేరకు తగ్గి , ఎక్కువ మంది వీనిటి వినియోగించాలని ప్ర్‌భుత్వం సబ్సిడీని ఇచ్చింది. ఫేమ్‌-2 సబ్సినీని బ్యాటరీ సామర్ధ్యంతో లింక్‌ చేశారు. ఈ స్కీమ్‌ కింద త్రీ వీలర్స్‌కు ఒక కిలోవాట్‌ బ్యాటరీకి 10వేల రూపాయలు సబ్సిడీగా అందిస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలు కార్లు, కమర్షియల్‌ వాహనాల వంటి వాటికి వాటి ధరలో 20 శాతానికి మించకుండా సబ్సిడీ ఇస్తున్నారు.

- Advertisement -

టూ వీలర్స్‌కు కిలోవాట్‌ బ్యాటరీ సామర్ధ్యానికి 15వేలు, గరిష్టంగా వాహనం ఖరీదులో 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ప్రస్తతం దీన్ని కిలోవాట్‌కు 10వేల రూపాయలు, గరిష్టంగా వాహనం ఖరీదులో 20 శాతం సబ్సిడీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫేమ్‌ సబ్సిడీ తగ్గించినందున ఈవీ టూ వీలర్స్‌ ధరలు జూన్‌ 1 తరువాత 15 వేల నుంచి 30వేల వరకు పెరిగే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్ధ్యాన్ని బట్టి ఈ ధరల్లో తేడాలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement