Friday, May 3, 2024

పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. సీఎం పట్టుదలే కారణం : సబితారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సీఎం కేసీఆర్ పట్టుదల అంకుటిత దీక్ష నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యావత్ తెలంగాణ ప్రజల విజయం. కాళేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

దశాబ్దాల కల సాకారం కాబోతున్న వేల రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల రైతాంగంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి,వికారాబాద్,నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలానే లక్ష్యంతో రూ.35 వేల కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టగా ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు.

ఎవరెన్ని అడ్డంకులు,అవరోధాలు సృష్టించిన,ఎన్ని కుట్రలు పన్నినా, చెక్కుచెదరని జన సంకల్పంతో సీఎం కేసీఆర్ అనుమతులు వచ్చేలా కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. కొత్త సెక్రటీరియేట్ లో మొదటి సమావేశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైనే నిర్వహించి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత చాటారని ఆమె పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక విజయం,ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి,వికారాబాద్, నల్గొండ జిల్లాల లోని 16 నియోజకవర్గాలు,70 మండలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టనుందన్నారు. సాగు,తాగునీటి,పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడనుందన్నారు.

ప్రపంచంలోనే అతి ఎత్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సాక్ష్యాత్తు కేంద్ర జల వనరుల మంత్రి ప్రకటిస్తే,బీజేపీ పార్టీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు చేతనైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తో మన ప్రాంతం సస్యశ్యామలం కానుందని,మరో కోన సీమా గా మారుతుందని మంత్రి సబితారెడ్డి ధీమా వ్యక్తంచేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement