Thursday, May 2, 2024

Test series | 22 ఏళ్ల‌ త‌రువాత‌.. జింబాబ్వేకు ఆతిథ్య‌మివ్వ‌నున్న ఇంగ్లండ్..

ఇంగ్లండ్-జింబాబ్వే చివరిసారిగా 2003లో టెస్ట్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెస్టర్-లీ-స్ట్రీట్‌లో ఆతిథ్య జట్టు (ఇంగ్లండ్) 69 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కాగా, 22 ఏళ్ల తర్వాత తొలిసారిగా పురుషుల టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వేకు ఇంగ్లాండ్ మ‌రో సారి ఆతిథ్యం ఇవ్వనుంది.

2025 మేలో నాలుగు (28 -31 వ‌ర‌కు) రోజుల పాటు జ‌ర‌గ‌నున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్ జ‌ట్టు జింబాబ్వేతో 3 రెండు టెస్టుల సిరీస్‌లు ఆడింది., అందులో 1996లో జ‌రిగిన మ్యాచ్ డ్రా అవ్వ‌గా.. 2000, 2003లో గెలిచింది.

“రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా పురుషుల టెస్టు మ్యాచ్‌కు జింబాబ్వే ఆతిథ్యమివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ ఇవ్వాల (మంగళవారం) తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement