Friday, May 10, 2024

ఇంగ్లండ్ – టీమిండియా టెస్ట్ సిరీస్‌, జులై 1న ప్రారంభం.. రోహిత్ కు కరోనా.. మ‌యాంక్ కు చాన్స్!

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జూలై 1న ప్రారంభం కానుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారినపడడం జట్టులో కలకలం రేగింది. అయితే KL రాహుల్‌కు గాయం, రోహిత్ శర్మకు క‌రోనా పాజిటివ్ కారణంగా టెస్టు ప్రారంభమయ్యే నాటికి వీరు కోలుకోకపోతే ఏంట‌న్నది ఇప్పుడు అంద‌రినీ వేదిస్తున్న ప్ర‌శ్న‌? కాగా, వీరికి ప్రత్యామ్నాయంగా కర్నాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ కు పిలుపు అందిన‌ట్టు స‌మాచారం. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో మయాంక్ అగర్వాల్ ను కూడా చేర్చారు. మయాంక్ ఇప్పటికే ఇంగ్లండ్ బయల్దేరాడని, త్వరలోనే బర్మింగ్ హామ్ లో టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

అయితే.. గ‌త ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ కోవిడ్ -19 కార‌ణంగా ఆగిపోయింది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని పర్యాటక జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా, బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ), ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ) ఈ ఏడాది మిగిలిన టెస్ట్ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని నిర్ణయించారు.

ఇక.. అగర్వాల్ విషయానికి వస్తే, రైట్ హాండ్ బ్యాటర్.. చివరిగా ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జ‌రిగిటెస్టు సిరీస్‌లో ఆడాడు. అయితే, అతను రెండు మ్యాచ్‌ల నుండి 19.66 సగటుతో 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జూన్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో కర్నాటక తరపున కూడా ఆడాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement