Thursday, December 5, 2024

అంతులేని అభిమానం.. శుభ‌లేఖ‌ల‌పై మోడీ, బండి సంజ‌య్ ఫొటోలు..

అంతులేని అభిమానం అంటే ఇదేనేమో.. నిర్మ‌ల్ జిల్లా భైంసా ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌కుడు త‌న పెళ్లికి త‌యారు చేపించుకుంటున్న శుభ‌లేఖ‌ల‌పై దేవుడి ఫొటోలు పెట్టాల్సిన ప్లేస్ లో ఏకంగా మోడీ, బండి సంజ‌య్ ఫొటోలు పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. ఇదేంట‌ని అడిగితే త‌న అభిమాన నాయ‌కులు వీరే అని స‌మాధానం ఇస్తున్నాడు ఆ పెళ్లికొడుగు. వివ‌రాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నివాసం ఉంటున్న పిప్పేర గంగ ప్రసాద్ ఈ నెల 24న పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వెడ్డింగ్ కార్డుల‌పై దేవుడి చిత్రాలు ముద్రించాల్సిన స్థానంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఫొటోలను వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

బండి సంజ‌య్ నుంచి అభిమానికి ఫోన్‌…
భైంసాలో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ వార్త కాస్త బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌ద్దకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బండి సంజయ్ వెంట‌నే గంగా ప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడాడు. 24న వీలైతే పెళ్లికి వస్తానని లేకపోతే భైంసా వచ్చినప్పుడు మీ ఇంటికి భోజనానికి వస్తానని బండి సంజయ్ మాటిచ్చాడు. తన అభిమానాన్ని గుర్తించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ నుండి ఫోన్ రావడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement