Tuesday, May 21, 2024

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ.. ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు

కల్లోల శ్రీలంకలో సోమవారం మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈనెల 20 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరుగకుండా మూడు రోజుల ముందస్తు ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఈనేపథ్యంలో దేశంలో ఆందోళనలు, హింస తలెత్తకుండా ముందు జాగ్రత్తచర్యగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నేటినుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటిస్తూ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే సోమవారం గెజిట్‌ విడుదల చేశారు. ప్రజా భద్రత, శాంతిభద్రతలు, ప్రజాసేవల నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా దేశంలో పబ్లిక్‌ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సోమవారం ఉదయం 17న 2288/30 నెంబరు గల ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలావుండగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని శ్రీలంక పార్లమెంటు ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. నిజం గెలుస్తుందన్న నమ్మకం ఉండడంవల్లే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ఇటీవల ఆయన పేర్కొన్న విషయం విదితమే. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే సోమవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 225 మంది సభ్యులున్న పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని జులై 20న ఎన్నుకోనుంది.

ప్రజా భద్రతా ఆర్డినెన్స్‌లోని 2వ భాగం అత్యవసర నిబంధనలను విధించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ఇది ఒక పరిస్థితిని ఎదుర్కోవడానికి పోలీసులు సరిపోరని రాష్ట్రపతి అభిప్రాయపడితే, అతను సాయుధ బలగాలను నిర్వహించడానికి పిలుపునిస్తూ ఆర్డర్‌ను గెజిట్‌ చేయవచ్చు. ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బలగాలకు శోధించడానికి, అరెస్టు చేయడానికి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను తొలగించడానికి, ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతినిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement