Sunday, April 28, 2024

మమతాకు ఈసీ మరోసారి నోటీసులు

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై ఈ నెల 7న, మార్చి 28న కేంద్ర బలగాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శనివారం ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని పేర్కొంది. కేంద్ర పారామిలిటరీ బలగాలపై మమత పూర్తిగా తప్పుడు, రెచ్చగొట్టే రీతిలో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ప్రాథమిక విచారణలో తేలింది. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలపై మమతకు గతంలోనూ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. ఓట‌ర్లను మతాల పేరుతో విడ‌గొట్టే ప్రయ‌త్నా‌లకు వ్యతి‌రే‌కంగా గళ‌మె‌త్తు‌తూనే ఉంటా‌నని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పేర్కొన్నారు. ఈ విష‌యంలో ఈసీ పదిసార్లు నోటీ‌సులు జారీ చేసినా తన వైఖరి మార‌దని మమత స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement