Sunday, April 28, 2024

ఎడిటోరియ‌ల్ – బైడ‌న్ ప‌ర్య‌ట‌న వేళ పుతిన్ నిప్పులు…

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి ఈనెల24వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది.ఈ సందర్భంగా ఆ దేశం లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అమె రికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌లో పర్యటన ప్రారం భించారు.ఇంతకాలం ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో బయటపెట్టారు. ఉక్రేనియన్లతో తమకు ఎటువంటి కోపం,ద్వేషం లేదనీ, అక్కడి పాలకుల ధోరణి నచ్చక పోవడం వల్లనే దాడులు చేస్తున్నామని పుతిన్‌ రష్యా ఫెడరల్‌ అసెంబ్లిdలో ప్రసం గిస్తూ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన మనసు లోని మాటలను బయటపెట్టారు.ఉక్రెయిన్‌పై దాడికి వెళ్ళడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆరోపిం చారు. ఆయన సూటిగా చెప్పకపోయినా అమెరికాపైనే ఆరోపణలను ఎక్కుపెట్టారు.డాన్‌బాస్‌లో సమస్యలను పరిష్కరించేందుకు తమ దేశం కృషి చేస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌కి ఆయుధాలు,ఆర్థిక వనరులు ఇచ్చి పశ్చిమ దేశాలు డర్టీగేమ్‌ ప్రారంభించాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రష్యా సార్వ భౌమాధికారాన్ని కాపాడ ుకవడమే తక్షణ కర్తవ్యంగా తాము రంగంలోకి దిగామని స్పష్టం చేశారు.

నాటోదళాలను పెంచుతూ పశ్చిమ దేశాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం వల్లనే తమ దేశం ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించినట్టు చెప్పు కొచ్చారు.అంతా బాగానే ఉంది. ఉక్రేనియన్లపై తమకు ఎటువంటి ద్వేషం లేదని చెబుతూనే వేలాది మంది మరణానికి కారణమైన క్షిపణి దాడులను ఎందు కు జర పాల్సి వచ్చిందో పుతిన్‌ యావత్‌ మానవజాతికి సమా ధానం చెప్పాలి. పుతిన్‌ పేర్కొన్నట్టు డాన్‌బాస్‌ సమస్య రష్యా, ఉక్రేనియన్లకు సంబంధించినదే. కానీ, దాని మూ లంగా రష్యా ఏడాదిగా జరుపుతున్న దాడుల వల్ల నష్టపోతున్నది కేవలం ఉక్రెయిన్‌ పౌరులు మాత్రమే కాదు.యావత్‌ ప్రపంచం తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.ముఖ్యంగా, చమురు, గ్యాస్‌, వంట నూనెల సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడటం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఈ యుద్ధంలో ఇరువైపులా దాదా పు లక్ష మంది సైనికులు మరణించారు. మృతుల్లో ఉక్రె యిన్‌కి సాయంగా వెళ్ళిన దేశాల సైనికులు కూడా ఉన్నా రు. ఇందుకు బాధ్యత రష్యాదే కదా! పుతిన్‌ చెప్పినట్టు డాన్‌బాస్‌ సమస్య రష్యా, ఉక్రెనియన్లకు సంబంధించిం దినదే. కానీ, ఉక్రెయిన్‌పై క్షిపణుల దాడి వల్ల ఆకాశ హ ర్మ్యాలు నేలమట్టంకావడానికి, వాటి కింద పిల్లలు, పెద్దలు నలిగి ప్రాణాలు కోల్పోవడానికి,పిల్లలు అనాథలు కావడానికి బాధ్యత రష్యాది కాదా?అమెరికా దూకుడు వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి దుర్మార్గాలు జరిగిన మాట వాస్తవమే.కానీ, ఉక్రెయిన్‌ యుద్ధంలో మారణహోమానికి మాత్రం పూర్తిగా రష్యాదే బాధ్యత అనీ, ముఖ్యంగా,పుతిన్‌ మూర్ఖత్వమే కారణమని యా వత్‌ ప్రపంచం కోడై కూస్తోంది.అందువల్ల పశ్చిమ దేశా లదే బాధ్యత అని నెపం వేసి తప్పించుకోవడానికి పుతిన్‌ వీలులేదు.ఉక్రెయిన్‌ను పురికొల్పింది, ఆయుధాలను స మకూర్చింది,ఆర్థిక సాయాన్ని అందించింది .ఉక్రెయిన్‌ కి అమెరికా ఇంతవరకూ 50 బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించింది.మరో 50 బిలియన్‌ డాలర్ల సాయాన్నీ, క్షిపణులను సమకూర్చడానికి బైడన్‌ వాగ్దానం చేసారు. అమెరికామిత్ర దేశాలైన ఆస్ట్రేలియా,. బ్రిటన్‌ తదితర దేశాలు కూడా ఉక్రెయిన్‌కి ఆర్థిక,ఆయుధ సాయాన్ని అందిస్తున్నాయి

.ఒక్క ఉక్రెయిన్‌లోనే కాదు, ప్రపంచం లో పలు చోట్ల వివిధ దేశాల మధ్య చిచ్చు రేపి ఆయు ధ, ఆర్థిక సాయం అందించడం అమెరికాకు అలవాటు. వియత్నాం యుద్ధం నుంచి అమెరికా తీరు యావత్‌ ప్రపంచం చూస్తూనే ఉంది.సోవియట్‌రష్యా లో అంత ర్భాగమైన ఉక్రెయిన్‌ని తమ దేశంలో కలుపుకోవడానికి రష్యా సాగిస్తున్న యత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్‌పై రష్యాదాడి చేసిందన్న నిర్ణయానికి ప్రపంచంలోని అన్ని దేశాలూ వచ్చాయి.అందువల్లపుతిన్‌ చెప్పే మాటలన్నీ అర్థ సత్యాలే కానీ, పూర్తి సత్యాలు కావు. అంతేకాకుండా, అమెరికాతో అణ్వస్త్రాల పరిమితి ఒప్పందం నుంచి తప్పుకోవడానికి రష్యా ఆలోచిస్తోందని కూడా పుతిన్‌ ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ ఒప్పందాన్ని తాత్కా లికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేశారు. పుతిన్‌ చేసిన ప్రసంగంలో పశ్చిమ దేశాల గురించే పదే పదే ప్రస్తా వించినప్పటికీ, మరీ ముఖ్యంగా ఆయన అమెరికానే టార్గెట్‌ చేస్తూ ఈ ప్రకటనచేసినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement