Tuesday, May 14, 2024

బ్యాంక్​ ఫ్రాడ్​ కేసులో బిజినెస్ మన్.. 7,52 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకున్న ఈడీ

బ్యాంకును మోసం చేసి, విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బు మళ్లించిన కేసులో హర్యానా బిజినెస్ మన్ కు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవ్వాల అటాచ్ చేసుకుంది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం హర్యానాకు చెందిన మహేష్ టింబర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌కు చెందిన రూ.7.52 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అటాచ్ చేసింది.

అశోక్ కుమార్ మిట్టల్‌కు చెందిన స్థిరాస్తులు పంజాబ్‌లోని మాన్సాలో ప్లాట్లు, భూమి రూపంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన కంపెనీ మహేష్ టింబర్, దాని డైరెక్టర్ అశోక్ కుమార్ మిట్టల్, ఇతరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ వంటి కేసులున్నాయి. అంతేకాకుండా పబ్లిక్ సర్వెంట్‌పై దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది

.బ్యాంకు అధికారులతో సహకారంతో కంపెనీ మోసపూరితంగా రూ.173.03 కోట్ల నిధులను విదేశాలకు బదిలీ చేసిందని, అసలు లెటర్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ రూ.21.47 కోట్లకు విరుద్ధంగా ఉందని ఈడీ ఆరోపించింది. వీరి మోసాలతో బ్యాంకుకు రూ.155 కోట్ల నష్టం వాటిల్లిందని, సింగపూర్‌లో రిజిస్టర్ అయిన డైరెక్టర్ యొక్క సంబంధిత సంస్థకు బ్యాంక్ రుణం నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. లావాదేవీలను వెబ్ ద్వారా నిర్వహించి డబ్బును స్వాహా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ED అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement