Thursday, April 25, 2024

ఢిల్లిలో భూప్రకంపనలు.. ఐదు రోజుల వ్యవధిలో రెండోసారి

దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూ ప్రకంపనలు సంభవించాయి. ఐదు రోజుల వ్యవధిలో ప్రకంపనలు చోటుచేసుకోవడం ఇది రెండవసారి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ(ఎన్‌సీఎస్‌) ప్రకారం భూకంప కేంద్రం అఫ్గానిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత శ్రేణిలో గుర్తించారు. 5.9 తీవ్రతతో ఫైజాబాద్‌లో భూకంపం ఏర్పడింది. భూ ఉపరితలం నుంచి 199 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని పర్యవసానంగా ఢిల్లిలో రాత్రి 8గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పేర్కొన్నారు.

ఇంతవరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ లేదా ఆస్తినష్టం వాటిల్లినట్లు నివేదికలు రాలేదు. అంతకు ముందు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లి-ఎన్‌సీఆర్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌కు ఉత్తర వాయువ్యంగా ఉంది. భూమిలోపల 5కి.మీ లోతున ప్రంకపనలు వచ్చాయి. నవంబర్‌ 12న ఢిల్లి, ఎన్‌సీఆర్‌ అంతటా ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 5.4గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement