Saturday, March 23, 2024

2023 ఆసియాకప్‌ షెడ్యూల్‌ ఖరారు.. ఒకే గ్రూప్‌లో తలపడనున్న దాయాదులు

ఈ ఏడాది ఆసియాకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయని బీసీసీఐ కార్యదర్శి జైషా ఖాయం చేశాడు.
ఆసియాకప్‌ -2023 (వన్డే ఫార్మెట్‌)లో భాగంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఉన్న ఈ మెగా టోర్నీలో భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్‌, పాక్‌తో పాటు క్వాలిఫయిర్‌ ఓ గ్రూపులో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్‌, అప్గనిస్థాన్‌లు మరో గ్రూప్‌లో ఉన్నాయి.


ఈ మేరకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జైషా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 2023, 2024 సంవత్సరాలకు గానూ ఏసీసీ నిర్వహించబోయే షెడ్యూల్‌ వివరాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్బంగా షా తన ట్వీట్‌లో ‘2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్‌ క్యాలెండర్‌ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తోంది’ అని పేర్కొన్నాడు. 2023తో పాటు 2024లో జరగబోయే ఆసియాకప్‌ (టీ 20 ఫార్మాట్‌)లో కూడా భారత్‌ , పాక్‌లు ఒకే గ్రూప్‌లో ఉండటం గమనార్హం. కానీ అప్పుడు ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement