Tuesday, April 30, 2024

Earthquake – బంగాళాఖాతంలో భూకంపం – అండమాన్‌ నికోబార్‌ దీవులలో హైఅలర్ట్‌

అండమాన్‌ నికోబార్‌ – బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. అండమాన్‌ నికోబార్‌ దీవులకు వాయవ్య దిశగా సుమారు 200 నాటికల్‌మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది.

భూకంపం వల్ల అండమాన్‌ నికోబార్‌ దీవులు ప్రభావితమయ్యాయి. తీరంలో అలలు పోటెత్తడంతో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కాగా, తీర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. సునామీ ముప్పు లేదని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement