Thursday, May 2, 2024

సిక్కింలో భూకంపం..

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్‌ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది. యుక్సోమ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement