Tuesday, May 21, 2024

TS | డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగంపు.. పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. జూన్ 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కాగా, 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో SGTలు 6,508, స్కూల్ అసిస్టెంట్స్ 2,629, LP లు 727, PET లు 182 ఉన్నాయి. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో 220 SAలు, 796 SGT పోస్టులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement