Tuesday, May 21, 2024

క‌ర‌వు భార‌తం….

భవిష్యత్తులో మెరుపు కరవు
మారుతున్న వాతావరణం
మట్టిలో తగ్గుతున్న నీటి శాతం
అడుగంటుతున్న భూగర్భ జలాలు
నీటి కొరతతో సాగులో నష్టాలు
పెరగనున్న తాగునీటి డిమాండ్‌
గాంధీనగర్‌ ఐఐటీ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : భారతదేశంలో రోజురోజుకూ వస్తున్న వాతావరణపరమైన మార్పులతో.. కరువు పరిస్థితులు పెరిగే అవకాశం ఉందని గాంధీనగర్‌ ఐఐటీ అధ్యయనం లో స్పష్టమైంది. భవిష్యత్తులో భారత్‌లో మరింత కరువు పరిస్థితులు ఎదురుకానున్నాయని హెచ్చరించింది. వాతావరణంలో శరవేగంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని అధ్యయనంలో వెల్లడైంది. కరువు ముంచు కొస్తుండటంతో.. పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. నీటి కొరత పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలలో తేమ శాతం చాలా వేగంగా క్షీణిస్తోందని తెలిపారు. సంప్రదా యక కరువుకు భిన్నంగా ఇది ఉండనుందని.. రెండు మూడు వారాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వివరిం చారు. పంట దిగుబడితో పాటు నీటి డిమాండ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఏదేమైనా.. భారతదేశంలో.. ప్రస్తుత, భవిష్యత్తులో వాతావరణం కారణంగా మెరుపు కరువులు సంభవించే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ మెరుపు కరువులు సంభవించే అవకాశం ఉందని తెలిపా రు. 21వ శతాబ్దంలో 7 రెట్లు మెరుపు కరువు పెరిగే ఆస్కా రం ఉందని వివరించారు. నేలలో తేమ, వాతావ రణ శాఖ సమాచారం.. వాతావరణ మార్పులు.. వంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
1951-2016 మధ్య, 1979లో దేశంలో మెరుపు కరు వులు వచ్చాయన్నారు. ఆ సమయంలో 40 శాతం దేశం కరువు కోరల్లో చిక్కుకుందని తెలిపారు. ప్రస్తుతం 5 రెట్లు వేసవి తాపం పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. వరుణుడు ముఖం చాటేయడం.. రుతు పవనాలు ఆలస్యంగా రావడం.. వంటివి మెరుపు కరువులకు ప్రధాన కారణాలు. మెరుపు కరువు కారణంగా పంటలు చీడ పీడల బారినపడటం, నీటి సమస్యలు ఎదు రవుతా యి. ఈ అధ్యయ నానికి సం బంధించిన కీలక విషయాలు.. ఎన్‌ పీజే క్లైమేట్‌ అండ్‌ అట్మాస్పియ రిక్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యా యి. వేసవి రుతు పవనాల సమయం లో భారత దేశంపై మెరుపు కరువు సంభవిం చినప్పుడు.. వాతావ రణం వేడెక్కడా న్ని పరిశోధకులు గమనిం చారు. నేలలో తేమ శాతం తగ్గుతుం డటం.. భారత వాతావరణ శాఖ నుం చి కీలక సమాచారం ద్వారా గాంధీ నగర్‌ ఐఐటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.
గ‌తంతో పోలిస్తే భారీ సంక్షోభం..

గతంలో మెరుపు కరువు పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకు ని.. భవిష్యత్తులో ఏర్పడే క్లిష్ట పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. 21వ శతాబ్దం చివరి నాటికి.. 1979 నాటి మెరుపు కరువుతో పోలిస్తే.. తీవ్ర సుమారు 7 రెట్లు ఎక్కువగా ఉంటుంద ని ఐఐటీ గాంధీ నగర్‌ సివిల్‌ ఇంజినీర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విమల్‌ మిశ్రా తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా.. భవిష్యత్తులో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండే ప్రమాదం ఉందన్నారు. దీంతో రుతు పవనాలు ఆలస్యం అవుతాయని.. దీంతో మెరుపు కరువు సంభవిస్తుందని వివరించారు. ఈ అధ్యయనంలో గాంధీనగర్‌ ఐఐటీకి చెందిన సరన్‌ ఆధార్‌, శాంతి స్వరూప్‌ మహతోలుకూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement