Sunday, May 5, 2024

ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ‘డ్రీమ్ గర్ల్ 2’.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే !

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, రాజ్ శాండిల్య డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ మూవీ డ్రీమ్ గ‌ర్ల్ 2. ఆగ‌స్ట్ 25న థియేట‌ర్లలోకి వ‌చ్చిన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వ‌సూల్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ గా నిలిచింది. కాగా, ఈ మూవీ తాజాగా ఎంట్రీ ఇచ్చింది. థ‌యేట‌ర్ల‌లోకి వ‌చ్చిన రెండు నెల‌ల త‌రువాత.. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఏక్తా ఆర్ కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సినిమాలో పరేష్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, సీమా పహ్వా ఇతరులు కీలక పాత్రల్లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement