Wednesday, May 1, 2024

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ను నమ్మోద్దు : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరుతో వచ్చే మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ లేదా మెస్సేజ్‌లను వినియోగదారులు నమ్మవద్దని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. కొంత మంది వ్యక్తులు వినియోగదారులకు పోన్లు చేసి.. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని, కరెంట్‌ కట్‌ చేస్తామని చెప్పి బ్యాంకు ఆకౌంట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు తెలుసుకుని బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యుత్‌ సిబ్బంది బిల్లుల చెల్లింపుల కోసం పోన్లు చేయరని, బ్యాంకు వివరాలను, డెబిట్‌ కార్డుల వివరాల జోలికి వెళ్లరని తెలిపారు. బిల్లుల చెల్లింపులో ఏమైనా తేడాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలన్నారు. బిల్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉంటే రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేడం సంస్థ చేయదని రఘుమారెడ్డి వివరించారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరుతో ఎరైనా పోన్లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement