Friday, April 26, 2024

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులను ఎదుర్కోలేక బైడెన్ సర్కార్ చేతులెత్తేసింది: ట్రంప్​

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అమెరికా 20 ఏళ్ల త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమ‌వారం రాత్రి చివ‌రి అమెరికా సైనికుడు కూడా కాబూల్‌ను వీడాడు. అయితే ఆ దేశం విడిచి వెళ్లే ముందు అక్క‌డ తాము విడిచి పెట్టిన అనేక ఎయిర్‌క్రాఫ్ట్‌, సాయుధ వాహ‌నాలు, ఆయుధాల‌ను అమెరికా సైనికులు ప‌ని చేయ‌కుండా చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. తుపాకీలతో గాల్లోకి కాల్పులు జరిపి మరీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకోవడం ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇంత చెత్త ఉపసంహరణ చరిత్రలో ఎన్నడూ లేదని బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులను ఎదుర్కోలేక బైడెన్ సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. మొత్తం అత్యాధునికమైన ఆయుధాలను అక్కడ వదిలేసి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక విమానాల్లో ఆ ఆయుధాలను, వాహనాలను తీసుకొచ్చేయాలని డిమాండ్ చేశారు. 8,500 కోట్ల డాలర్ల సంపదలో ఒక్క డాలర్ ను కూడా వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఒకవేళ తాలిబన్లు వాటిని తిరిగివ్వకుంటే భారీ బలగాలతో అక్కడకు చేరుకుని తీసుకొచ్చేయాలన్నారు. అది చేతగాదంటే బాంబులు వేసైనా వాటిని నాశనం చేయాలన్నారు. అమెరికా ఇంత చెత్తగా వెనుదిరిగి వచ్చేస్తుందని ప్రపంచం ఊహించలేదన్నారు.

ఇది కూడా చదవండి: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement