Friday, April 26, 2024

హైదరాబాద్ లో పెరిగిన బిర్యానీ ధరలు!

హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు ఇది చేదు వార్తే. అప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణకు గురైన నేపథ్యంలో ఆ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీ ప్రియులపై పడింది. అఫ్గాన్ నుంచి మసాలా దినుసుల దిగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ వాటి ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో హైదరాబాద్ బిర్యానీ ధరలను తయారీదారులు పెంచేశారు.

హైదరాబాద్‌లో బిర్యానీ తయారీలో వినియోగించే మసాలా దినుసులు ఎక్కువగా అఫ్ఘానిస్తాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. చాలామంది అఫ్గాన్ వ్యాపారులు హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో భారత్ కు దాదాపు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలు పెరగడంతో రెస్టారెంట్ల యజమానులు సైతం బిర్యానీ ధరను ఏకంగా రూ.100కి పైగా పెంచేశారు.

రెస్టారెంట్లను బట్టి గతంలో హైదరాబాద్‌లో బిర్యానీ ప్లేట్ ధర రూ.250 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.350వరకు పెరిగింది. రూ.400 ఉండే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ధర రూ.550 వరకు చేరింది. ఇక, జంబో ప్యాక్ ధర రూ.600 ఉండగా.. రూ.700-800 వరకు పెంచేశారు. పెరిగిన ధరతో బిర్యానీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement