Friday, September 22, 2023

తెలంగాణ లో తగ్గుతున్న కరోనా…కొత్తగా ఎన్ని కేసులో తెలుసా ?

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 482 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా తో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 455 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,835కు చేరుకోగా… ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,833కు పెరిగింది..

- Advertisement -
   

ఇక, డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,38,865కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 88,164 శాంపిల్స్‌ పరీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement