Saturday, June 3, 2023

రావ‌ణాసుర నుండి సాంగ్ రిలీజ్ పై అప్ డేట్

రావ‌ణాసుర చిత్రం నుండి డిక్కా డిష్యుం అనే పాట‌ని మార్చి 22న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.హీరో రవితేజ మాస్ ఎనర్జిటిక్‌ వైబ్‌తో సాంగ్ ఉండబోతున్నట్టు తెలియజేశాడు ద‌ర్శ‌కుడు సుధీర్‌ వర్మ. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీలో సుశాంత్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లు రావణాసుర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement