Wednesday, May 22, 2024

న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా హైకోర్టులో ధర్నా.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘ ప్రొటక్షన్‌ యాక్ట్‌’ను తీసుకురావాలని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రఘునాథ్‌ ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టులో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మల్లారెడ్డి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులు వృత్తిపరంగా కోర్టుల్లో పనిచేస్తుంటే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది మల్లారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఈ మధ్య కాలంలోనే 70 నుంచి 80మంది న్యాయవాదులపై దాడులు జరిగాయని, హత్య చేశారని, చాలా మందిపై తప్పుడు కేసులు బనాయించారని , ఈ ఘటనల్లో ఎక్కడా సజావుగా, ని ష్పక్షపాతంగా దర్యాప్తు జరగలేదని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement