Sunday, May 5, 2024

పేద పిల్ల‌ల చ‌దువు కోసం మాష్టారు పోరాటం..

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌-టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్‌'(తెలుగు)/ ‘వాతి’ (తమి ళం). ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్‌, సంయుక్త మీనన్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వి డుదల కానుంది. ధనుష్‌ న టించిన తొలి తెలుగు చిత్ర మిది. హైదరాబాద్‌ లో ఈ చిత్ర -టైలర్‌ విడుదల కార్య క్రమం జరిగింది. కథానాయ కుడు ధనుష్‌, కథానాయిక సంయుక్త మీనన్‌, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

తాజాగా విడుదలైన ‘సార్‌’ మూవీ -టైలర్‌ ఆకట్టు-కుంటోంది. చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై కథానాయకుడు సాగించే పోరాటమే సార్‌ . -టైలర్‌ విడుదల సందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ ”ఇది నా మొదటి తెలుగు సినిమా. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియన్‌ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం. ఈ కథ చాలా బాగుంటు-ంది.
నాకు ఇంతమంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. అలాగే చినబాబు గారికి, నాగవంశీ గారికి, త్రివిక్రమ్‌ గారికి, సంయుక్త మీనన్‌, హైపర్‌ ఆది మరియు మా టీ-మ్‌ అందరికీ ధన్యవాదాలు.” అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ”ధనుష్‌ కథ వినగానే ఈ సినిమా చేస్తు న్నాను అనడంతో నాకు ఆ ఆనందంలో మాటలు రాలేదు. ” అన్నారు.
నాయిక సంయుక్త మాట్లాడుతూ ” సర్‌ సిని మా అందరినీ అలరిస్తుం దని” తెలిపారు.
హైపర్‌ ఆది మాట్లాడుతూ ”ధనుష్‌ గారి సినిమాల్లో రఘు వరన్‌ బి.-టె-క్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే సినిమా సార్‌. అద్భుతంగా ఉంటు-ంది ఈ సినిమా. ఒక తెలుగు యువ దర్శకుడు తమిళ స్టార్‌ కి కథ చెప్పి ఒప్పించాడంటే తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. ఫిబ్రవరి 17న థియేటర్లకి వెళ్లి చూడండి ” అన్నారు.
చివరిగా ధనుష్‌ సినిమాలో నటించిన స్టూడెంట్స్‌, టీ-మ్‌ తో కలసి చిత్రంలోని మాస్టారు…. మాస్టారు గీతం ఆలపించి అభిమానుల సంతోషాన్ని అంబరాన్ని తాకేలా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement