Thursday, May 2, 2024

చ‌దువుతున్నామా? కొంటున్నామా? ధ‌నుష్ ‘సార్’ మూవీ రివ్యూ..

నటీనటులు : ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, ‘హైపర్’ ఆది, ‘ఆడుకాలమ్’ నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి , సుమంత్
ఛాయాగ్రహణం : జె. యువరాజ్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, ద‌ర్శ‌క‌త్వం : వెంకీ అట్లూరి

కథ :
జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా లైఫ్ లీడ్ చేస్తున్న బాలగంగాధర్ తిలక్ (ధనుష్), తన జీవితంలో సీనియర్ లెక్చరర్ గా ప్రమోట్ అవ్వాలని ఆశ పడతాడు. అనంతరం జరిగిన కొన్ని సంఘటనల అనంతరం సిరిపురం లోని గవర్నమెంట్ కాలేజీకి ప్రైవేట్ లెక్చరర్ గా వస్తాడు. ఆ కాలేజీలోని 45 మంది విద్యార్థులు పాస్ అయ్యేలా చదువు చెబితే బాలగంగాధర్ సీనియర్ లెక్చరర్ గా ప్రమోట్ అవుతాడు. దాంతో బాలగంగాధర్ వాళ్లకు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతాడు. అయితే, ఈ మధ్యలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం బాలగంగాధర్ జీవితం మలుపు తిరుగుతుంది ?, అసలు బాలగంగాధర్ ఏం చేశాడు ?, ఇంతకీ బాలగంగాధర్ చదువు చెప్పిన స్టూడెంట్స్ పాస్ అయ్యారా ? లేదా ?, ఈ మధ్యలో బాలగంగాధర్ కి మీనాక్షి కి మధ్య లవ్ ట్రాక్ ఏమిటి? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ :

విద్యా ధనమే ప్రధానం అనే కోణంలో సాగిన ఈ సార్ చిత్రం.. చదువు గొప్పతనం చెప్పే చిత్రంగా మిగిలిపోతుంది. ‘ఈ ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు’ అనే పాయింట్ చుట్టూ దర్శకుడు వెంకీ అట్లూరి అల్లుకున్న కథ బాగుంది. అలాగే అతని టేకింగ్ ఆకట్టుకుంది. చదువు అమ్ముకోవడమే బెటర్ బిజినెస్ అని నమ్మే ఓ స్వార్ధపు బిజినెస్ మెన్ కు – చదువు పంచాలి కానీ, అమ్మకూడదు అని నమ్మే ఓ మాస్టర్ కి మధ్య జరిగిన ఈ సంఘర్షణ మయంలో చాలా అంశాలు బాగున్నాయి.
కమర్షియల్ లోకంలో ఇలాంటి నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి సహజ పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీయడమే దర్శకుడు వెంకీ అట్లూరి సక్సెస్. ధనుష్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. సంయుక్త నటన కూడా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.. జి వి ప్రకాష్ సంగీతం సందోర్బ‌చితంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement