Saturday, April 27, 2024

వంద కోట్ల క్ల‌బ్ లో ధ‌మాకా.. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

ర‌వితేజ‌..శ్రీలీల జంట‌గా న‌టించిన చిత్రం ధ‌మాకా..ఈ చిత్రం వంద‌కోట్ల క్ల‌బ్ లోకి చేరిపోయింది..ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. ఇది రవితేజ మార్కు సినిమా .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ. ఆయన నుంచి ఆడియన్స్ కోరుకున్న తరహాలో మాటలు .. పాటలు .. డాన్సులు ఉండటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తొలిరోజునే ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, చాలా వేగంగా 90 కోట్లను రాబట్టింది. అక్కడి నుంచి కాస్త నెమ్మదించింది. 14వ రోజుతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement