Sunday, April 28, 2024

ధ‌మాకా.. మొద‌టిరోజు క‌లెక్ష‌న్స్

హీరో రవితేజ మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తున్నాడు. ధమాకా సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఆయన గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది ధమాకా. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా ఎంటర్టైన్మెంట్ బాగా ఉండటంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి రోజు ఏపీ తెలంగాణలో 4.50 కోట్ల షేర్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. ప్రపంచ వ్యాప్తంగా 5.10 కోట్ల షేర్ వచ్చింది .ధమాకా’ సినిమా సేఫ్ అవ్వాలంటే 20 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ రిపోర్టు చూసిన తర్వాత వీకెండ్ లోనే సేఫ్ జోన్ కు వచ్చేలా కనిపిస్తోంది. అదే జరిగితే రెండేళ్ల తర్వాత రవితేజకు హిట్టు పడినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement