Thursday, November 7, 2024

ప్రత్యేక వసతులకోసం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫిటీషన్

వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ప్రత్యేక వసతుల కోసం పిటీషన్ దాఖలు చేశారు.
కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రత్యేక వసతులు కల్పించాలని కడప జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ అధికారులు కౌంటర్ ఫిటీషన్ దాఖలు చేశారు. ఈమేరకు కడప జిల్లా కోర్టులో సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. శివశంకర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని వాదించారు. న్యాయస్థానం విచారణ ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement