Saturday, April 10, 2021

ఐపీఎల్‌కు టెన్షన్.. RCB ఆటగాడికి కరోనా పాజిటివ్

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే పలువురు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలోని కొందరు సిబ్బందికి, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఐపీఎల్ అధికారులు అతడిని ఐసోలేషన్‌లో ఉంచారు. దీంతో ఏప్రిల్ 9న ముంబైతో జరిగే ఆరంభ మ్యాచ్‌కు పడిక్కల్ దూరం కానున్నాడు. 2020లో ఓపెనర్‌గా వచ్చిన పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. అతడు దూరమవడం కోహ్లీ టీమ్‌కు దెబ్బేనని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో పడిక్కల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News