Sunday, April 11, 2021

కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత:బొడిగె శోభ

బీజేపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంచలన కామెంట్ చేశారు. తనకు ఏం జరిగినా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల బాధ్యత అని అన్నారు బొడిగె శోభ. నన్ను చంపుతానని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారని.. అపరిచిత వ్యక్తులు చేసిన ఫోన్ కాల్ పై కరీంనగర్ సీపీ ఫిర్యాదు చేశాను..’’ అన్నారు. నాకు ఏం జరిగినా కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత,అడ్వకేట్ వామన్ రావు దంపతుల లాగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శలపై నేను మాట్లాడను.. ఆయనను విమర్శించేంత తక్కువ స్థాయి నాది కాదు.. సుంకె రవిశంకర్ నా జాతి వ్యక్తి కాబట్టి నేను మాట్లాడను.. గతంలో మంద కృష్ణ మాదిగ పై కూడా విమర్శలు చేయాలని కేసీఆర్ చెప్తే నేను మాట్లాడలేదు… కేటీఆర్, సంతోష్ రావు కలిసి నన్ను చంపించాలని ఓ మనిషిని పెట్టారనిపిస్తోంది.. అయినా నేను భయపడేది లేదు..నాకేమైనా జరిగితే వీళ్లిద్దరిదే బాధ్యత..’’ అని బొడిగె శోభ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News