Friday, May 3, 2024

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపేసిన డెన్మార్క్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫ‌ర్డ్ క‌రోనా వ్యాక్సిన్ వినియోగాన్ని యురోపియ‌న్ దేశం డెన్మార్క్ పూర్తిగా నిలిపేసింది. ఈ వ్యాక్సిన్ వ‌ల్ల తీవ్ర‌మైన సైడ్ఎఫెక్ట్స్ వస్తుందటంతోనే దీని వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ దేశం చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, యురోపియ‌న్ డ్ర‌గ్ కంట్రోల‌ర్ చెప్పినా కూడా డెన్మార్క్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్లేట్‌లెట్ల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం, వ్యాక్సిన్‌కు మ‌ధ్య క్రాస్ రియాక్ష‌న్ ఉన్న‌ట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ చెప్పారు. డెన్మార్క్‌లో ఇప్ప‌టికే వైర‌స్ సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న అంద‌రికీ వ్యాక్సిన్లు వేశామ‌ని, క‌రోనా నియంత్ర‌ణ‌లోనే ఉన్న‌ద‌ని తెలిపారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై సొంతంగా విచార‌ణ జ‌రిపి వాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది డెన్మార్క్. ఇకపై ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల‌నే ఇక నుంచి డెన్మార్క్ ఉప‌యోగించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement