హైదరాబాద్, ఆంధ్రప్రభ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్-2022 పరీక్ష ఈ రోజు (శనివారం) ప్రశాంతంగా జరిగింది. మొదటి సెషన్‌లో 4967 మందికిగానూ 3572(71.92 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
రెండో సెషన్‌లో 6713 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 5073(75.57 శాతం) మంది పరీక్ష రాశారు. అధికారిక వెబ్ సైట్‌లో ఈనెల 27న ప్రాథమిక కీ ని అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. కీ విడుదల చేసిన పది రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.