Friday, May 3, 2024

తగ్గిన ఎగుమతులు.. పెరిగిన వాణిజ్యలోటు

మన దేశం నుంచి అక్టోబర్‌లో ఎగుమతులు తగ్గాయి. దిగుమతులు పెరిగాయి. వాణిజ్యలోటు పెరిగింది. గత సంవత్సరం అక్టోబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం ఎగుమతులు 16.65 శాతం క్షీణించి 29.78 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో 35.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి. వాణిజ్య శాఖ ఈ వివరాలను మంగళవారం నాడు విడుదల చేసింది. వాణిజ్యలోటు 25.71 బిలియన్‌ డాలర్ల నుంచి 26.91 శాతానికి చేరిది. దిగుమతులు 53.64 బిలియన్‌ డాలర్ల నుంచి 56.69 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య ఎగుమతులు 12.55 శాతం మేర పెరిగి, 263.35 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 33.12 శాతం పెరిగి 436.81 శాతంగా నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా, తైవాన్‌ మద్య వివాదం ఇలా అనేక భౌగోళిక రాజకీయ పరిస్థితుల మూలంగా సరఫరా వ్యవస్థలో అంతరాలు వంటి పలు కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. మన ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది. ఇది మన దేశ విదేశీ కరెన్సీ నిల్వలపై ప్రభావం చూపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement