Wednesday, May 1, 2024

Darling: ప్ర‌భాస్‌కు స్వీటీ బర్త్ డే విషెస్‌.. ది బెస్ట్ అందుకోవాలని ట్వీట్‌

ప్రభాస్‌ పుట్టిన రోజు సోషల్‌ మీడియాలో అతనికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ‘రాధేశ్యాం’ టీం స్పెషల్‌ టీజర్‌ను విడుదల చేసి తమ హీరోకు బర్త్‌డే గిఫ్ట్‌ను అందించింది. మైత్రీ మూవీ మేకర్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, యూకే క్రియేషన్స్‌, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పూజా హెగ్డే, నివేదా థామస్‌, భాగ్యశ్రీ, సుధీర్ బాబు, భాగ్యశ్రీ, రాశీ ఖన్నా, వెంకటేష్‌, తమన్, గోపీచంద్ మలినేని, వెన్నెల కిశోర్‌, అనిల్‌ రావిపూడి, ప్రదీప్‌ మాచిరాజు తదితర ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా డార్లింగ్‌కు పుట్టిన రోజు విషెస్‌ తెలిపారు.

ఇక ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల్లో ప్రభాస్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న స్వీటీ అనుష్క ట్విట్ట‌ర్‌ ద్వారా తన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ది బెస్ట్‌గా ఉండాలి..
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు…నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి ది బెస్ట్‌గా ఉండాలి. ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి నీ కథలన్నీ చేరాలి. నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్విట్టర్‌ ద్వారా విష్‌ చేసింది అనుష్క.

Advertisement

తాజా వార్తలు

Advertisement