Thursday, May 2, 2024

హెల్మెట్ పెట్టుకోవాలని నానికి పోలీసుల సెటైర్

హీరో నానికి పోలీసులు సెటైర్ వేశారు. అయితే అది ప్రజలకు అవగాహక కాల్పించడానికేనండోయ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులరయిన ఫోటోనో కాని వీడియోలతో గాని ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య బాగా ఫేమసయిన ఓ విషయాన్ని ట్రాఫిక్ రూల్స్‌కి అనువాదించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సారి కూడా అందులో భాగంగానే నానికి సెటైర్ వేశారు. ఈ మధ్య నాని నటించిన జెర్సీ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో జెర్సీ మూవీలో నాని ఫోటోను వాడుకున్నారు. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీలో బ్యాట్ పట్టుకుని ముఖాన హెల్మెట్ పెట్టుకుని ఏ పోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్.. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. ఏదైనా పోలీసులకు హాట్సప్ చెబుతూ ఆ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement