Saturday, May 4, 2024

IPL | చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్స్.. సీఎస్కే టార్గెట్ 135..

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న పోరులో హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ల ఉచ్చులో పడిపోయింది. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. .. మథీశ పథిరన వేసిన 20వ ఓవర్‌లో మార్కో జాన్‌సెన్(13) బౌండరీ బాదాడు. వాషింగ్టన్ సుందర్(8)ను ఆఖరి బంతికి ధోనీ రనౌట్ చేశాడు. దాంతో, 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్‌ తీశారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), హ్యారీబ్రూక్(18) తక్కువకే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి(21) రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కెప్టెన్ ఏయిడెన్ మర్‌క్రం(12), మయాంక్ అగర్వాల్(2) విఫలమయ్యారు. ఆఖర్లలో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్‌సెన్(17) పోరాడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement