Sunday, May 5, 2024

ముఖచిత్రం మూవీకి.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ముఖచిత్రం..గంగాధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సందీప్‌ రాజ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నాడు.పాకెట్‌ మనీ పిక్చర్స్ బ్యానర్‌ ఎస్‌కేఎన్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ముఖచిత్రం డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ మూవీలో రవిశంకర్‌, చైతన్య రావ్‌ మదాడి, అయేషా ఖాన్‌ కీ రోల్స్ పోషిస్తున్నారు. సినిమా బండి ఫేం వికాస్ వశిష్ట, హుషారు ఫేం ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ వచ్చింది. ముఖచిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ముఖచిత్రం ట్రైలర్‌ ట్విస్టులతో సాగే ట్రయాంగిల్‌ స్టోరీతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement