Saturday, April 27, 2024

Counter – ఆర్థికంగా ఎద‌గ‌లే! ఆ ప్ర‌చారం అతిపెద్ద తప్పు – రఘురామ్ రాజన్

భార‌త ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మొద్ద‌ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ వృద్ధిని సాధించాలంటే ముఖ్యమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి శ్రామికశక్తి విద్య, నైపుణ్యాల మెరుగుదల అంశం ప్రధాన సమస్యగా మారుతుందని అన్నారు. ఈ సవాలును పరిష్కరించకపోతే దేశ యువ జనాభా ప్రయోజనాలను పొందలేదని అన్నారు.

రాజకీయ నాయ‌కుల మాట‌లు న‌మ్మొద్దు..

రాజ‌కీయ నాయ‌కులు చేసే ఈ ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ఆర్థిక వేత్త ర‌ఘురామ్ రాజ‌న్ అన్నారు. ఈ ప్రచారం నిజమవడానికి ఇంకా చాలా ఏండ్లు కష్టపడాల్సి ఉంటుందన్నారు. దీన్ని జనాలు నమ్మాలని రాజకీయ నాయకులు భావిస్తుంటారని, తాము సాధించామని చెప్పుకోవడానికి వారు యత్నిస్తుంటారని అన్నారు. అయితే.. భారత్ ఈ ప్రచారాన్ని నమ్మడం తప్పు అవుతుందన్నారు. మరోవైపు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని రఘురామ్ రాజన్ కొట్టిపారేశారు. దేశంలోని చాలా మంది పిల్లలకు హైస్కూల్ స్థాయి చదువులేనప్పుడు, మధ్యలోనే చదువు మానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి లక్ష్యం గురించి మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో శ్రామిక శక్తి ఉందని, యువత మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే దేశానికి ప్రయోజనమని అన్నారు. శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement