Sunday, April 28, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డిఆర్‌జీ)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కేర్లపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిచోర్‌గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో డీఆర్‌జీ బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా భావిస్తున్న చిచోర్‌గూడ, నిలవాయ గ్రామాల మధ్య రహదారి పనులు సాగుతున్నాయి.

చిచోర్‌గుడా సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పెట్రోల్‌ సిబ్బంది సైతం కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో డీఆర్‌జీ కానిస్టేబుల్‌ సోవ్దుు, మె#హూ రామ్‌ కశ్యప్‌ గాయపడ్డారని చెప్పారు. ఘటనతో అప్రమత్తమైన అదనపు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నారని పేర్కొన్నారు. గాయపడిన జవాన్లను సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement