Thursday, May 2, 2024

ఏపీలో కరోనా ఆంక్షల సమయం పొడిగింపు

ఏపీలో కరోనా కేసుల తాజా పరిస్థితులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కోవిడ్, వ్యాక్సినేషన్ తాజా పరిస్థితిపై ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ ఆంక్షల సడలింపు మరో గంట పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.

మరోవైపు శ్రావణమాసం సీజన్ నడుస్తుండటంతో ఏపీలో తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి ఉందని గుర్తు చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు‌. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రాధాన్యత క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లో సిబ్బందిని నియమించాలని సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో రెండు ఛార్జిషీట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement