Saturday, May 4, 2024

రష్యాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. బూస్టర్ డోస్ మొదలెట్టిన ప్రభుత్వం..

రష్యాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత పెరగుతుండటంతో ప్రభుత్వం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు పంపిణీ చేపడుతున్నట్లు రష్యా ప్రకటించింది. జులై 1 వ తేదీ నుంచి రెండు డోసులు తీసుకున్న వారికి బూస్ట‌ర్ డోస్‌ను ఇస్తున్నారు.  రెండో డోస్ తీసుకొని ఆరు నెల‌ల త‌రువాత మూడో డోస్ ఇవ్వ‌నున్నారు.  అంతేకాదు, ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని పుతిన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రెండు డోసుల త‌రువాత కూడా కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్న రష్యా.. మూడో డోసు పంపిణీలోనూ మొదటిస్థానంలో నిలిచింది.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్: విరాట్‌.. ఒక్కో పోస్ట్‌కు రూ.5 కోట్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement