Monday, May 20, 2024

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేరళ, మహరాష్ట్రలో అత్య‌ధికం..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, మహరాష్ట్రలో వైరస్‌ ఉనికి చాటుతోంది. ఆ ప్రభావం కొత్త కేసులు, బాధితుల సంఖ్యపై కనిపిస్తోంది. క్రమేపీ క్రియాశీల కేసులు 21 వేల మార్కు దాటాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గురువారం 4.25 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 4,041 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందు రోజు 3, 712గా ఉన్న కొత్త కేసులు.. 300కి పైగా పెరిగాయి. 84 రోజుల తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవే. పాజిటివిటీ రేటు ఒక శాతానికి చేరువైంది. కేరళలో 1,370, మహరాష్ట్రలో 1,045 మంది వైరస్‌ బారిన పడ్డారు.

ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులున్నాయి. ముంబయిలో పాజిటివిటీ రేటు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ప్రజలంతా కోవిడ్‌ నియమావళిని పాటించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కోరారు. మరోసారి ఆంక్షల చట్రంలోకి వెళ్లకూడదనుకుంటే.. ఎవరికి వారు స్వచ్చందంగా నిబంధనలు పాటించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement