Sunday, May 5, 2024

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న కేసులు ఎక్కడా తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు  65 శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కేంద్రం. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 35,871 కేసులు నమోదు కాగా… ఇందులో 23,179 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 172 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోనే 84 మంది మృతి చెందారు. 85 శాతం కేసులు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement