Friday, May 17, 2024

నాలుగో రౌండ్ ముగిసే నాటికి 15,483 ఓట్ల ఆధీక్యంలో టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి ప‌ల్లా..

న‌ల్గొండ – నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి రౌండ్ రౌండ్ కి త‌న ఆధీక్యాన్ని కొన‌సాగిస్తున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు రౌండ్ల‌లో మొత్తం 15వేల 438 ఓట్ల మెజార్టీతో ప్ర‌త్య‌ర్ధుల‌కు అంద‌నంత దూరంలో ఉన్నారు.. ఇప్పటివరకు TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 63,442 ఓట్లు వచ్చాయి….తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మల్లన్న కు 48వేల 004 ఓట్లు, కోదండ‌రాంకి 39 వేల 605 ఓట్లు రాగా బిజెపి అభ్య‌ర్థి ప్రేమేంద‌ర్ కు 23వేల 703 ఓట్లు ద‌క్కించుకున్నారు. మూడో రౌండ్‌లో పల్లాకు 15,558 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (నవీన్‌కుమార్‌)కు 11,742, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 11,039, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌కు 5,320, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4,333 ఓట్లు పోలయ్యాయి. మరో 3,092 ఓట్లు చెల్లకుండాపోయాయి. మూడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 47,545, నవీన్‌కుమార్‌కు 35,8858, కోదండరామ్‌కు 29,560 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 11,687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ నవీన్‌కుమార్‌కు 12,070 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244, రాణిరుద్రమకు 1,634, చెరుకు సుధాకర్‌కు 1,330, జయసారధికి 1,263 ఓట్లు ద‌క్కాయి. మరో 3,009 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు రాగా, తీన్‌మార్‌ మల్లన్నకు 12046 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 9080 ఓట్లు వచ్చాయి. మూడుస్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్‌రెడ్డికి 6615 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో 2789 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్ర‌స్తుతం అయిదో రౌండ్ కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement